నటుడు మమ్ముట్టి కి కోవిడ్-19 పాజిటివ్

Published on Jan 16, 2022 4:35 pm IST


మమ్ముక్కగా పేరుగాంచిన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఇదే విషయాన్ని స్టార్ హీరో సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని అన్నారు. తేలికపాటి జ్వరంతో పాటు బాగానే ఉన్నట్లు తెలిపారు. సంబంధిత అధికారుల సూచనల మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మీరందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు.

ఇటీవల CBI 5 అనే పేరుతో తన రాబోయే సినిమా కి సంబందించిన సెట్స్‌లో చేరారు. ఈ నటుడు కరోనావైరస్ బారిన పడినందున, షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది. అంతేకాకుండా, సూపర్ స్టార్ ప్రాణాంతక వైరస్ నుండి కోలుకోవాలని నటుడి యొక్క అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :