నటనను వదిలేద్దామనున్నా… వదల్లేకపోతున్నాడట !

నటనను వదిలేద్దామనున్నా… వదల్లేకపోతున్నాడట !

Published on Jun 8, 2026 3:05 PM IST

Manoj-Bajpayee

విలక్షణ నటుడిగా మనోజ్‌ బాజ్‌పేయీకి మంచి పేరు ఉంది. బాలీవుడ్‌ లో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న మనోజ్‌ బాజ్‌పేయీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి, అలాగే తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ‘గత పదేళ్లుగా నాకు నటనను మానేయాలని అనిపిస్తూనే ఉంది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఏదో ఒక పాత్ర నా ఖాతాలో వచ్చి చేరుతుంది. దాంతో నా నటనా జీవితం ఇంకా కొనసాగుతూనే ఉంది’ అని ఆయన తెలిపారు.

మనోజ్‌ బాజ్‌పేయీ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నటన మానేయాలని అనుకోవడానికి కారణం ఉంది. సంవత్సరాల తరబడి సీరియస్, మానసికంగా అలసిపోయే పాత్రలు చేసినప్పుడు.. కచ్చితంగా మన స్వభావం చాలా చిరాకుగా మారుతుంది. మూడ్‌ స్వింగ్స్‌ కూడా పెరుగుతాయి. దీని వల్లే నేను నటనను వది లేయాలని చాలాసార్లు అనుకున్నాను. నాకు మొదటి నుంచి నటనను డబ్బు, అవసరం కోసం కాకుండా.. అభిరుచితో చేయాలనుకుంటున్నాను’ అని మనోజ్‌ బాజ్‌పేయీ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు