టక్ జగదీష్ ట్రైలర్ లో ఏం చూడటానికి మీరు ఉత్సాహం గా ఉన్నారు? – హీరో నాని

Published on Aug 30, 2021 7:57 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ చిత్రం లో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ట్రైలర్ విడుదల కార్యక్రమం కూడా నిర్వహించనుంది చిత్ర యూనిట్. ఈ చిత్రం ట్రైలర్ గురించి హీరో నాని సోషల్ మీడియా ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

టక్ జగదీష్ ఫ్యామిలీ లో భాగం అవ్వడానికి ఇది సమయం అంటూ చెప్పుకొచ్చారు. మీరు రెడీ నా అని అంటూ, మీ ప్రొఫైల్ నేమ్ ను మార్చివేసి టక్ జగదీష్ గురించి ఒక్క వర్డ్ లో చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు. ట్రైలర్ నుండి ఏం చూడటానికి మీరు ఉత్సాహం గా ఉన్నారు అని నాని తెలిపారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10 వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సైతం ప్రొఫైల్ నేమ్ ను మా జరిగింది. టక్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇన్ అంటూ మార్చివేసింది. అంతేకాక అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కి సంబందించి ఒక ముక్క లో సినిమా గురించి తమ సమాధానం ఇస్తున్నారు.

సంబంధిత సమాచారం :