నటుడు ప్రకాష్ రాజ్ కి మోడీ అభిమాని షాక్.

Published on Jun 16, 2019 9:24 am IST

ప్రధాని మోడీ అభిమాని చర్య నటుడు ప్రకాష్ రాజ్ ని షాక్ గురిచేసిందిట. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న “వెంకీ మామ” షెడ్యూలు కాశ్మీర్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ కొరకు కాశ్మీర్ వెళ్లిన ప్రకాష్ రాజ్ మార్నింగ్ వాక్ చేస్తుండగా, ఓ తల్లి కూతురు ఆయన తో సెల్ఫీ కావాలని అడగడంతో ఆయన సరే అని చెప్పి వారితో సెల్ఫీ దిగారట. ఐతే ఈ సంఘటనను దూరం నుండి చూస్తున్న ఆమె భర్త అక్కడకు వచ్చి మోడీని విమర్శించే ఈనటుడు ఫోటో మన మొబైల్ లో ఉండడానికి వీలు లేదు అని, ఆ ఫోటోని డిలీట్ చేసాడట సదరు మోడీ వీరాభిమాని. ఈ సంఘటనతో షాక్ కి గురైన ప్రకాష్ రాజ్ ఇటీవల తనకు ఎదురైన ఈ విచిత్ర సంఘటన గురించి చెప్పుకొని వాపోయారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ దేశంలో మోడీ ని విమర్శించే హక్కుకూడానాకు లేదా? ఇకపైన ఈ విషయం వలన నాకు సినిమా అవకాశాలు తగ్గిపోయినా ఆశ్చర్య పోవాల్సినపనిలేదు అని మోడీ పై తన అసహనాన్ని బయటపెట్టారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రకాష్ రాజ్ బెంగుళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైనారు.

సంబంధిత సమాచారం :

X
More