పవన్ కళ్యాణ్ నాకు జీవితం ఇచ్చారు…చిరంజీవి గారు నా ప్రాణాన్ని కాపాడారు – బండ్ల గణేష్!

Published on Aug 24, 2021 7:40 pm IST

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్, హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వెలువడింది. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.

ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో ను తాజాగా బండ్ల గణేష్ షేర్ చేయడం జరిగింది. ఇందులో మా ఎన్నికల కి సంబంధించిన ప్రశ్నలకు తనదైన శైలి లో సమాధానం ఇచ్చారు బండ్ల గణేష్. సినిమా అంటే క్రేజు, జనానికి మోజు, కిక్ అది, మాదే న్యూస్ అంటూ బండ్ల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం గా మారాయి. ఈ ఇంటర్వ్యూ లో మా ఎన్నికల అంశం గురించి ప్రస్తావిస్తూ, తను ఎందుకు ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇస్తున్నారు అనే దాని పై క్లారిటీ ఫుల్ ఇంటర్వ్యూ చూస్తేనే తెలుస్తుంది. ఈ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ తనకి జీవితాన్ని ఇచ్చారు అని, చిరంజీవి గారు తన ప్రాణాలను కాపాడారు అంటూ చెప్పుకొచ్చారు. కోవిడ్ భారిన పడిన బండ్ల గణేశ్ చిరు చేసిన సహాయం గురించి ప్రస్తావించారు. అంతేకాక బండ్ల గణేశ్ మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ ఇంటర్వ్యూ లో వెల్లడించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి ఇంటర్వూ చూడాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :