పుకార్ల వెనకున్న అసలు నిజం చెప్పిన నటుడు పృధ్వి

Published on Jun 20, 2019 9:51 am IST

“ఖడ్గం” సినిమాకి గాను ఆయన చెప్పిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో బాగా పాపులరైన నటుడు పృధ్వి. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలలో కనిపించిన ఆయన ప్రస్తుతం మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఐతే గత కొన్ని రోజులుగా పృధ్విపై ఓ వార్త మాధ్యమాలలో విశేషంగా ప్రచారం అవుతుంది.గతంలో మెగా కుటుంబంపై పృధ్వి చేసిన రాజకీయ ఆరోపణల కారణంగా ప్రస్తుతం త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ నుండి పృధ్విని కావాలనే బయటకు పంపించారని, మెగా కుటుంబం మొత్తం ఆయనను తమ సినిమాల నుండి బహిష్కరించాలని నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నటుడు పృధ్వి ఈ విషయం పై స్పందించారు. ఈ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదన్న ఆయన ‘అత్తారింటికి దారేది” సినిమా తరువాత త్రివిక్రమ్ నేను కలిసింది లేదు అన్నారు. త్రివిక్రమ్-బన్నీ మూవీ నుండి నన్ను బహిష్కరించారు అనేది పూర్తిగా అవాస్తవం, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియదు అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More