8 ఏళ్ల తర్వాత మహా సముద్రం లో నటించడం పై సిద్దార్థ్ కీలక వ్యాఖ్యలు!

Published on Aug 27, 2021 8:00 pm IST

అజయ్ భూపతి దర్శకత్వం లో శర్వానంద్, సిద్దార్థ్, అను ఎమ్మన్యూల్, అదితి రావు హైదరి, జగపతి బాబు, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం కి సంబంధించిన విడుదల తేదీ ను చిత్ర యూనిట్ నేడు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం పై నటుడు సిద్ధార్ద్ స్పందిస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు.

కల నెరవేరింది అంటూ సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. 8 ఏళ్ల తర్వాత తన ఫస్ట్ తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ అని అన్నారు. మహా సముద్రం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 14 వ తేదీన విడుదల కానుంది అని అన్నారు. ఈ దసరా చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చారు. థియేటర్ల లో కలిసేందుకు ఎదురు చూస్తున్నా అని తెలపడం ఆనందం గా ఉందని పేర్కొన్నారు. సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :