‘మెగా బ్రదర్’ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన నటుడు !

Published on Apr 7, 2019 6:39 pm IST

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు పుణ్యమా అని మాజీ మా అధ్యక్షుడు శివాజీరాజీకు నాగబాబుకు బాగానే చెడింది. నాగబాబు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే శివాజీ రాజా నాగబాబుకు ఎవరు ఓటు వేయొద్దని.. గతంలో నాగబాబు మా అధ్యక్షుడిగా పని చేసినప్పుడే ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని.. ఇక ఇప్పుడు మా నరసాపురం ఎంపీగా ఆయన ఇంతమంది ప్రజలకు ఏం చేస్తారని..ఆయనకు ఓటేస్తే.. ఓటు హక్కు వృధా అయినట్లే అని శివాజీరాజా కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

శివాజీ రాజా ఇంకా మాట్లాడుతూ.. చిరంజీవిగారు తనకు సొంత అన్నయ్య లాంటి వారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి వ్యక్తి అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు. కానీ నాగబాబు మీద మాత్రం శివాజీ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా ఎన్నికల్లో విన్ అయిన నరేష్ విజయంలో నాగబాబు సపోర్ట్ కూడా చాలా ఉంది. ఎన్నికలకు ముందే నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ నరేష్ ప్యానల్ కు ఓటు వెయ్యాల్సిందిగా కోరారు. ఏం శివాజీ రాజా ఓడిపోయాడు. దాంతో శివాజీ రాజా నాగబాబు విషయంలో బాగానే ఫీల్ అయ్యారు.

ఆ మధ్య శివాజీ రాజా నాగబాబు గురించి మాట్లాడుతూ.. ఫ్రెండ్ అనుకున్న నాగబాబు కూడా తనకు వ్యతిరేఖంగా ప్రెస్ మీట్ పెట్టి తనను విమర్శించడం బాగాలేదని… ఖచ్చితంగా త్వరలోనే తన నుండి నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ అందుతుందని శివాజీ రాజా వెల్లడించారు. బహుశా శివాజీ రాజా చెప్పిన రిటర్న్ గిఫ్ట్ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా నాగబాబు ఓటమేనేమో !

సంబంధిత సమాచారం :