మోసగాళ్లకు సోనూసూద్‌ వార్నింగ్ !

Published on Mar 8, 2021 3:10 am IST

సోనూసూద్‌ ఫౌండేషన్‌ పేరు మీద అక్రమంగా డబ్బు సంపాదించడానికి ఎవరో కొందరు మోసగాళ్ళు పాల్పడ్డారు. అమాయకుల నుంచి డబ్బు దోచుకుంటున్న లెటర్‌ హెడ్‌ని సోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌ హేండిల్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ఇటువంటి ఋణాలను ఏర్పాటు చేస్తానని ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదని నిర్ధారించాడు. ఇటువంటివారితో జాగ్రత్తగా ఉండమని కూడా గట్టిగా సూచించాడు. దీనికి సంబంధించి సోనూ ఉత్తరప్రదేశ్‌, ముంబయి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

ఇక కరోనా వల్ల దేశం అల్లకల్లోలం అయినప్పటి నుండి నటుడు సోనూ సూద్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. లాక్ డౌన్‌లో ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టాడు. సాయం కోరని వాళ్లకు అందరికీ తన వంతు సాయం చేశాడు. మొత్తానికి రియల్ లైఫ్ లో సోనూ హీరో అయ్యాడు.

సంబంధిత సమాచారం :