సూపర్ స్టార్ రజినీకాంత్ ‘లింగ’ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. భారి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్ల పెద్ద మొత్తంలో అమౌంట్ నష్టపోయారు. ఈ నష్టాన్ని రజినీకాంత్ భర్తీ చేయాలనీ కోరుతూ డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్ష చేయడానికి సిద్దమయ్యారు. పోలిసుల రక్షణతో పాటు కోర్ట్ అనుమతి కోరారు. ఈ పరిణామాల పట్ల సౌత్ ఇండియన్ ఆర్టిస్టుల అసోసియేషన్, నడిగర్ సంఘం తీవ్రంగా స్పందించింది. రజినీకాంత్ కు బాసటగా నిలుస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
‘సినిమా జయాపజయాలు ప్రేక్షకుల ఆదరణపై ఆధారపడి ఉంటాయి. ప్రతి వ్యాపారంలో లాభనష్టాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ దీనికి అతీతం కాదు. ‘లింగ’ సినిమా విజయం సాదిస్తుందని ప్రేక్షకులలో అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా బిజినెస్ జరిగింది.
అటువంటి ఒక సందర్భంలో.. డబ్బులు కోల్పోయినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతను సంప్రదించాలి. నష్టాన్ని కొంత భరించడమో..? లేదా తర్వాత సినిమాకు కాస్త సర్దుబాటు చేసుకోవడమో చేయాలి. నిర్మాతతో చర్చింది ఒక ఇరువురికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలి. అంతే కానీ, నష్టాలు భర్తీ చేయమని హీరోని అడగడం సరైన పద్ధతి కాదు. ప్రతి హీరోగా అప్ మరియు డౌన్స్ ఉంటాయి. లాభాలు వచ్చిన సమయంలో సంతోషంగా ఫీలయి, నష్టాలు సమయంలో హీరోని జోక్యం చేసుకోమనడం సరికాదు. అలా ఆశించే హక్కు లేదు. అందువలన, పంపిణీదారులు ఈ సమస్యపై నిర్మాతతో చర్చించుకోండి. అని నడిగర్ సంఘం పత్రికా ప్రకటనలో పేర్కొంది.


