ప్రభాస్ ని పొగిడేస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ.

ప్రభాస్ ని పొగిడేస్తున్న మరో బాలీవుడ్ బ్యూటీ.

Published on May 24, 2020 9:00 AM IST

ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధా కృష్ణ ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ లవ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఒక్కప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఇక అందరిలాగే ప్రభాస్ మంచి తనానికి భాగ్యశ్రీ కూడా ఫిధా అయిపోయారు. ప్రభాస్ తో సెట్స్ లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పంచుకున్న ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో భాగ్యశ్రీ మొదట బయపడ్డారట. ఐతే ప్రభాస్ ఫ్రెండ్లీ బిహేవియర్ ఆమె లోని ఆ భయాన్ని పోగొట్టిందట. ఇక ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినా అలా ఒదిగి ఉండడం ఆమెకు బాగా నచ్చిందట. ఇక వీరిద్దరూ ఫుడ్ లవర్స్ కావడంతో ఫుడ్ కి సంబందించిన అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారట. ఈ విషయాలన్నీ తాజా ఇంటర్వ్యూ లో భాగ్యశ్రీ చెప్పు కొచ్చారు. ఐతే ఈ సినిమాలో ఆమె రోల్ ఏమిటనే విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ త్వరలో తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు