ఇంటర్వ్యూ : దివ్యంకా కౌశిక్ – నాగ చైతన్య వెరీ లవ్లీ పర్సన్ !

Published on Mar 26, 2019 5:31 pm IST

సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మజిలీ. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన దివ్యంకా కౌశిక్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

మీ గురించి చెప్పండి ?

బేసిగ్గా మా ఫ్యామిలీ అంతా ఢిల్లీలో ఉంటారు. కానీ నేను నా కెరీర్ స్టార్టింగ్ లో కొన్నాళ్ళు బాంబేలో ఉన్నాను. అక్కడే యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ టైంలోనే కొన్ని యాడ్స్ లో కూడా నటించాను.

మజిలీ మీకు మొదటి సినిమానా ?

తెలుగు వరకే చూసుకుంటే మొదటి సినిమా మజిలీనే. కానీ నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఓ తమిళ్ మూవీ. ఫ్యాషన్ ఫిల్మ్స్ అనే బ్యానర్ లో తెరకెక్కుతోంది ఆ సినిమా. మజిలీ కంటే ఫస్ట్, ఆ మూవీనే చేశాను. అది ‘మే’ లో విడుదల అవుతుంది.

యాడ్స్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాను అన్నారు. ఆ యాడ్స్ నేమ్స్ ఏమిటి ?

ఫెరెన్ లవ్లీ యాడ్ తో పాటు ‘హీరో హొండా’ యాడ్ లో కూడా యాక్ట్ చేశాను. అలాగే ఇంకా కొన్ని యాడ్స్ చేశాను. నాకు యాక్టింగ్ పరంగా అవి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి.

మజిలీ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ?

ఈ సినిమాలో అన్షు అనే పాత్రలో నటించాను. వెరీ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీనా ?

లేదు అండి. కథ గురించి ఇప్పుడు నేను ఏమి చెప్పలేను. కానీ కథలో భాగంగా మా పాత్రల మధ్య వచ్చే డ్రామా చాలా బాగుంటుంది.

చైతుతో నటించడం ఎలా అనిపించింది ?

చైతు వెరీ లవ్లీ పర్సన్ అండి. కో ఆర్టిస్ట్ లకు చాలా బాగా కోపరేట్ చేస్తారు. టాలీవుడ్ లో నా మొదటి సినిమా చైతుతో నటించడం.. నిజంగా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా అనిపించింది.

మజిలీ దర్శకుడు శివ నిర్వాణ గురించి చెప్పండి ?

శివగారు చాలా బాగా ఎంకరేజ్ చేసారు. కొన్ని సీన్స్ లో నా నుంచి ఆయన యాక్టింగ్ రాబట్టుకున్న విధానం చూసి.. కొన్ని సందర్భాల్లో నేను కూడా థ్రిల్ గా ఫీల్ అయ్యాను. శివగారు డైలాగ్స్ విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేశారు.

మజిలీ సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి కదా. మీ ఫేవరేట్ సాంగ్ ఏది ?

అన్ని సాంగ్స్ నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి అండి. ప్రత్యేకంగా చెప్పాలంటే.. ప్రియతమా సాంగ్ చాలా బాగా నచ్చింది. అలాగే నా గుండెలో సాంగ్ కూడా నాకు చాలా బాగా ఇష్టం.

మీకు బాగా ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు ?

తెలుగులో అయితే సమంతగారు, బాలీవుడ్ లో అయితే ఆలియా భట్, కరీనా కపూర్. వాళ్ళే నాకు ప్రేరణ.

మీ తరువాత సినిమాలు గురించి చెప్పండి ? ఏమైనా అంగీకరించారా ?

ప్రస్తుతం ఓ తమిళ్ సినిమా జరుగుతుంది. ఇక కొత్తగా అయితే ఏ మూవీ ఒప్పుకోలేదు. కాకపోతే కొన్ని కథలు విన్నాను. ‘మజిలీ’ తరువాతే ఏ సినిమా చెయ్యాలో నిర్ణయించుకుంటాను.

సంబంధిత సమాచారం :