సీనియర్ నటి ఇంట్లో విషాదం !

Published on Jun 17, 2021 2:12 pm IST

సీనియ‌ర్ న‌టి క‌విత కుమారుడు సంజ‌య్ రూప్‌ కరోనా మహమ్మారితో కన్నుమూశారు. అలాగే ఆమె భ‌ర్త ద‌శ‌ర‌థ రాజ్‌ కూడా గ‌త కొన్ని రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతూ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. కవిత కుమారుడు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు.

సినీ మరియు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ‘123తెలుగు.కామ్’ నుండి కవిత కుమారుడి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఇక క‌విత ‘ఓ మ‌జ్ను’ అనే త‌మిళ సినిమాతో 11 ఏళ్ల‌కే వెండితెర అరంగ్రేటం చేసింది. సుమార్ 50కి పైగా త‌మిళ చిత్రాల్లో త‌ళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ సినిమాల్లోనూ న‌టించింది.

సంబంధిత సమాచారం :