ఇంటర్వ్యూ : హీరోయిన్ లయ – ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్!

Laya

‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’ వంటి క్లాసిక్ హిట్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటిస్తున్న క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ సందర్భంగా హీరోయిన్ లయ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

చాలా గ్యాప్‌ తరువాత శివాజీ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?

దాదాపు 20 ఏళ్ల తర్వాత శివాజీ గారితో కలిసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్‌కు తప్పకుండా కనెక్ట్ అవుతుంది.

మీ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉంటుంది?

ఈ చిత్రంలో నేను ఉత్తర పాత్రలో నటించాను. ఇప్పటి వరకు నన్ను నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు. నాకు కూడా ఈ పాత్ర వినగానే ఎంతో ఎక్జ్సయిటింగ్‌గా అనిపించింది. మంగపతిలాంటి పవర్‌ఫుల్‌ పాత్ర చేసిన హీరోను డామినేట్‌ చేసే పాత్ర నాది. కానీ శివాజీ గారు ఎంతో ఎంకరైజ్‌ చేశారు. నా రోల్ బాగా నచ్చింది. నేను, శివాజీ కలిసి నటించిన సన్నివేశాలు ఎంతో హిలేరియస్‌ గా ఉంటాయి.

శివాజీలో ఎలాంటి మార్పు ఏమైనా?

సినిమా అంటే ఆయనకు పాషన్‌. ప్రతిసారి సినిమాను జనాలకు ఎలా రీచ్‌ చేయాలి అనే విషయంపై తపన పడుతుంటాడు. సినిమాను అన్ని రకాలుగా ఆయన ప్రేమిస్తుంటాడు. సినిమాపై ప్రేమ అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెరిగింది.

దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ గురించి?

స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో. అంత క్లారిటీగా తెరకెక్కించాడు. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. సినిమాను ఎంతో హిలేరియస్‌గా తెరకెక్కించాడు. తనకు ఎలా కావాలో అలాంటి నటనను నటీ నటుల నుండి తీసుకున్నాడు. కాంప్రమైజ్‌ అవ్వని దర్శకుడు. అతనికి ఏం కావాలో అది బాగా తెలుసు. మంచి ప్రతిభ గల దర్శకుడు.

ఈ సినిమాలో మీ పాత్ర ప్రత్యేకత ఏమైనా ఉందా?

లయ అంటే ఎడిపించడం. ఏడవటం.. అనే గుర్తింపు ఉంది. కానీ ఈ సినిమాలో నేనే ఏడిపిస్తాను. ఎంతో ఎంజాయ్‌ చేసిన పాత్ర ఇది. స్వార్థంగా, తన భర్త, ఫ్యామిలీ గురించి ఆలోచించే స్వార్థపరులు పాత్ర. నా భర్త బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఉన్న పాత్ర ఇది.

మీ నెక్స్ట్ సినిమాల గురించి?

వదల అనే సినిమాలో జగపతిబాబు భార్యగా చేస్తున్నాను. శ్రీకాంత్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నాను. నాగేశ్వర రెడ్డి దర్శకుడు. యమలీల తరహాలో సోషియో ఫాంటసీ సినిమా. వదల అనేది సైకలాజికల్‌ థ్రిల్లర్‌. డిఫరెంట్‌ జోనర్‌లో ప్రయత్నిస్తున్నాను.

Exit mobile version