అనంతపురంలోని సుభాష్ రోడ్డులో ‘గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ’ నూతన షోరూం శనివారం సందడిగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటి, ‘రాజా సాబ్’ ఫేమ్ మాళవిక మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోయాజ్ కలెక్షన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడి ఆభరణాలు చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో విజయవంతంగా 22 స్టోర్లను నిర్వహిస్తున్న గోయాజ్, తమ 23వ శాఖను అనంతపురంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మాళవిక పేర్కొన్నారు. వెండి ఆభరణాలు యువతుల సౌందర్యాన్ని మరింత పెంచుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
షోరూం నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలోనే గోయాజ్ ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. అనంతపురం ప్రజల కోసం అన్ని రకాల వెండి ఆభరణాలను సరసమైన ధరల్లో అందుబాటులోకి తెచ్చామని, తమ 23వ స్టోర్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు.


