విరాటం పర్వం కొరకు బాలీవుడ్ నటి

Published on Aug 14, 2019 11:48 am IST

విలక్షణ నటిగా నందిత దాస్ కు దేశవ్యాప్తంగా ఎనలేని పేరుంది. ఆమె దశబ్దాలుగా వివిధ భాషలకు చెందిన అనేక అవార్డు విన్నింగ్ చిత్రాలలో నటించారు. ఆమె నటించిన చిత్రాలు అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంతో పాటు, అవార్డులు గెలుచుకోవడం జరిగింది. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ టబు విరాట పర్వం చిత్రం నుండి తప్పుకుందన్న విషయం తెలిసిందే, ఐతే ఆమె పాత్ర కొరకు నందిత దాస్ ని తీసుకుంటున్నారని వార్తలు వచ్చినప్పటికీ, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలుస్తుంది. నందిత ఓ ప్రత్యేకమైన కీలకపాత్ర చేస్తున్నారని సమాచారం.

ఇక రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విరాట పర్వం చిత్రాన్ని దర్శకుడు వేణు అడుగుల తెరకెక్కిస్తుండగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :