ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి నయనతార ఎంట్రీ… బాహుబలి వెబ్ సిరీస్ తో!

Published on Jul 16, 2021 6:30 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం భారతీయ చలన చిత్రం గా వెలుగొందింది. ఈ చిత్రం కేవలం భారత్ లో మాత్రమే కాకుండా, మిగతా దేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టడం మాత్రమే కాకుండా విశేష ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ బాహుబలి చిత్రం కి ముందు జరిగిన కథను వెబ్ సిరీస్ గా తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. బిఫోర్ బాహుబలి బిగీనింగ్ ఏం జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు.

అయితే ఇప్పటికే ఈ సీరీస్ కోసం వామీక గబ్బి ను శివగామి పాత్ర కోసం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ సిరీస్ లోకి ప్రముఖ నటి నయనతార అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ తో ఓటిటి లోకి అడుగు పెట్టడం మాత్రమే కాకుండా, తాను ఏ రోల్ చేస్తుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దీని పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :