ఇంటర్వ్యూ : నివేదా థామస్ – ‘ఎన్టీఆర్’గారంటే ఇష్టం !

Published on Jun 25, 2019 6:02 pm IST

శ్రీ విష్ణు హీరోగా నివేదా థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘బ్రోచేవారెవరురా’. ఓ కొత్తతరహా కామెడీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా నివేదా థామస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆమె వెల్లడించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం.

ఈ సినిమా గురించి చెప్పండి ?

ఈ సినిమాటైటిల్ ‘బ్రోచేవారెవరురా’ లాగే.. ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అలాగే మన సమాజంలో కొన్ని అంశాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘బ్రోచేవారెవరురా’లో మీ పాత్ర గురించి ?

ఈ సినిమాలో మిత్ర అనే పాత్రలో కనిపిస్తాను. ఒకవిధంగా మిత్ర కూడా నా స్వభావానికి దగ్గర ఉన్న అమ్మాయే. నేనే కాదు, దాదాపు 90 శాతం అమ్మాయిలు మిత్రలాగే ఉంటారు.

ఈ సినిమాలో క్లాసికల్‌ డ్యాన్సర్‌ గా నటించారు ?

చిన్నప్పటి నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ నే. ఐదేళ్ల వయసు నుండే క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఈ సినిమాలో మిత్ర క్లాసికల్‌ డ్యాన్సర్‌ గా గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంటుంది.

ఎందుకు తెలుగు సినిమాల్లో ఎక్కువుగా నటించడం లేదు?

సాధ్యమైనంత వరకూ ఎక్కువ సినిమాల్లో నటించడానికే ప్రయత్నిస్తున్నాను. కానీ షూటింగ్స్ ఆలస్యం అవుతుండటంతో ఎక్కువ సినిమా కనిపించలేకపోతున్నాను. కానీ ‘బ్రోచేవారెవరురా’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోన్నందుకు చాల ఆనందంగా ఉంటుంది.

‘జై లవకుశ’లో మీరు చిన్న పాత్రలో నటించారు ?

నాకు ఎన్టీఆర్ గారంటే అంటే ఇష్టం. ఇక ఆ సినిమాలో నాది చిన్న పాత్ర అయినప్పటికీ చాల కీలకమైనది.

‘దర్బార్‌’లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి కుమార్తెగా నటిస్తున్నారా..?

‘దర్బార్‌’ చిత్రబృందం నుంచి ఆఫర్ వచ్చింది. కానీ ఇంకా ఫైనల్ కాలేదు.

మీ తదుపరి చిత్రాలు గురించి చెప్పండి ?

తమిళంలో ఒక సినిమాకి సైన్ చేశాను. అలాగే తెలుగులో కూడా ఒక ఫిల్మ్ ఉంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More