బాహుబలి రైటర్ చిత్రంలో ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరోయిన్

బాహుబలి రైటర్ చిత్రంలో ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరోయిన్

Published on Sep 14, 2019 10:55 AM IST

Priyanka

మోహన్ లాల్, అల్లు శిరీష్ కాంబినేషన్ లో వచ్చిన ‘1971 భారత సరిహద్దు’ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ ప్రియాంక అగర్వాల్.తాజాగా ఆమె తెలుగులో బంపర్ ఆఫర్ దక్కించుకున్నారని సమాచారం.ఆమె ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో సినిమా చేయనున్నారు. ఈ బాహుబలి రైటర్ రాసిన ఓ కామెడీ కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక అగర్వాల్ ఎంపికైయ్యారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు, నిర్మాతగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారట.

కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్ గా ప్రియాంక అగర్వాల్ నటిస్తున్నారు. స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే నెల నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు