షాకింగ్ మెసేజ్ పోస్ట్ చేసిన రేణూ దేశాయ్‌ !

Published on Jun 5, 2021 5:00 pm IST

రేణూ దేశాయ్‌ తాజాగా పోస్ట్ చేసిన ఓ బ్యాంకు మెసేజ్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. రేణూ బ్యాంకింగ్‌ వ్యవహారాల పై తన ఇన్‌స్టాలో ఓ స్క్రీన్ షాట్‌ ను కూడా షేర్ చేశారు. రేణు దేశాయ్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ మొబైల్ యాప్‌ లోని తన అకౌంట్ లోకి లాగిన్ అయ్యారు. కాకపోతే ఆమె తన అకౌంట్ లోకి కాకుండా వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయ్యారు.

పైగా సదరు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా ఆమె చూడగలగడంతో షాక్‌ అయ్యాను అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి ఆమె హెల్ప్‌ లైన్ నంబర్‌ కు కూడా ఫోన్ చేసి విషయం చెప్పినా బ్యాంక్ వారు మాత్రం రేణు ఫిర్యాదును సీరియస్‌ గా తీసుకోలేదు. రేణు దేశాయ్ అయితే, ఆ బ్యాంకులో తన అకౌంట్‌ ను సోమవారం క్లోజ్‌ చేయబోతున్నట్టు కూడా ఆమె వెల్లడిస్తూ ఒక మెసేజ్ పెట్టారు.

సంబంధిత సమాచారం :