బిగ్ బాస్ హౌస్ లో నటి ఆత్మత్యాయత్నం…!

Published on Aug 19, 2019 12:50 pm IST

బిగ్ బాస్ హౌస్ సభ్యులలో ఒకరు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేయడం సంచలనంగా మారింది. వివరాలలోకెళితే తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 విజయవంతంగా దూసుకుపోతుంది. తెలుగు బిగ్ బాస్ షో కంటే ముందే తమిళంలో బిగ్ బాస్ ప్రారంభం కావడం జరిగింది. ఐతే అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తమిళ నటి మధుమిత ఏకంగా సూసైడ్ కి ప్రయిత్నించి సంచలనానికి తెరలేపింది. ఈవారం కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె తోటి ఇంటి సభ్యుల నుండి ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కోలేక ఈ పనికి ఒడిగట్టారు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ కి గురైన షో యాజమాన్యం ఆమె వెంటనే హౌస్ నుండి బయటకు పంపడం జరిగింది.

మిగతా భాషలలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో తో పోల్చితే తమిళంలో అధిక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ షో పట్ల కొందరు సామాజిక వాదులు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా, బిగ్ బాస్ డోంట్ కేర్ అంటూ దూసుకుపోతున్నాడు. తెలుగులో మూడు సీజన్స్ కి ముగ్గురు (ఎన్టీఆర్,నాని,నాగార్జున) వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, తమిళంలో మాత్రం కమల్ ఒక్కరే బిగ్ బాస్ షో అన్ని సీజన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :