ఇంటర్వ్యూ : యామిని భాస్కర్ – ఈ జర్నీ కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా ఉంది !

Published on Aug 27, 2018 6:08 pm IST

నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా యామిని భాస్కర్, కశ్మీర పరదేశి హీరోయిన్లుగా రాబోతున్న చిత్రం ‘@నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందింది. కాగా ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల అవ్వబోతుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర హీరోయిన్ యామిని భాస్కర్ మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం.

‘నర్తనశాల’లో మీ పాత్ర గురించి చెప్పండి ?
ఈ సినిమాలో సత్యభామ అనే పాత్రలో గా నటించాను. కృష్ణవంశీగారి సినిమాల్లో లాగానే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. నాతో పాటు మరో హీరోయిన్ కశ్మీర పరదేశి నటించినప్పటికీ మా ఇద్దరి క్యారెక్టర్స్ కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. తనది చాలా సాఫ్ట్ క్యారెక్టర్, నాది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఒక ధైర్యవంతురాలైన అమ్మాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తాను.

‘కీచక’ సినిమాలో మీ పెర్ఫామెన్స్ కి మంచి పేరు వచ్చింది. మరి తరువాత ఆఫర్స్ ఏమి రాలేదా ?
ఆఫర్స్ అంటే.. తెలిసిందే కందండి. అంటే నేనిప్పుడు కాంట్రావర్సీ గా మాట్లాడను. తెలుగు అమ్మాయిలకి హీరోయిన్స్ గా ఛాన్స్ఇవ్వరని నేను చెప్పను. కీచక మూవీలో నాకు మంచి పేరు వచ్చింది. కానీ ఆ సినిమా రిలీజ్ అయినా మూడు సంవత్సరాలకి కూడా నాకు పెద్దగా సినిమాలు రాకపోవడానికి కారణాలు నాకు తెలీదు. ఇక నర్తనశాల తర్వాత అన్నా నాకు అంత బాగుంటుందని అనుకుంటున్నాను చూద్దాం.

అంటే కీచక సినిమా తర్వాత మీరు ఏ సినిమాలు చెయ్యలేదా ?
చేశానండి. తమిళంలో మున్నొడి అని ఓ సినిమా చేశాను. అది లాస్ట్ ఇయర్ జులై లో రిలీజ్ అయింది. ఆ తరువాత మారుతిగారు బ్యానర్ లో భలే మంచి బేరం అని ఓ సినిమా చేశాను. అది సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది.

భలే మంచి బేరంలో హీరోయిన్ రోల్ చేస్తున్నారా, డైరెక్టర్ ఎవరు ?
హీరోయిన్ గానే చేస్తున్నాను. ‘రోజాలు మారాయి’ సినిమా డైరెక్టర్ మురళిగారు ఆ సినిమా డైరెక్ట్ చేశారు.

ఈ నర్తనశాల సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చింది ?
మా డైరెక్టర్ గారికి నేను నిజంగా చాలా థాంక్స్ చెప్పాలండి. ఓ మేనేజర్ ద్వారా నా ఫోటోస్ చూసి నన్ను పిలిచారు. నాకు తెలిసి లాస్ట్ వీక్ లో షూటింగ్ కి వెళ్లబోతుందనగా నేను ఈ మూవీకి ఒకే అయ్యాను. నన్ను సెలెక్ట్ చెయ్యటానికి నేను తెలుగు అమ్మాయి కావటం కూడా ఒక రీజన్.

తెలుగు అమ్మాయిగా మీ జర్నీ గురించి చెప్పండి ?
తెలుగు అమ్మాయిగా జర్నీ అంటే కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా ఉంది. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. లక్ బాగుండాలి, టైం బాగుండాలి. బహుశా నా టైం ఇంకా బాగాలేదేమో. గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నా.

నార్త్ హీరోయిన్స్ డామినేషన్స్ ఎక్కువుగా ఉందనిపిస్తోందా ?
డామినేషన్ అని చెప్పలేమండీ. అది కాంపిటేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతివారం ఐదు ఆరు మంది కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. సో కాంపిటేషన్ ఎక్కువుగా ఉంది.

నాగశౌర్యతో కలిసి నటించడం మీకెలా అనిపించింది ?
నాగశౌర్యతో కలిసి నటించడం చాలా హ్యాపీ అండి. కోఆర్టిస్ట్ లకి తను చాలా బాగా కోపరేట్ చేస్తారు.

మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ?
మాది విజయవాడ. చిన్నప్పటి నుండి నేను చదివింది, పెరిగింది అంతా విజయవాడలోనే. ఫోర్ ఇయర్స్ క్రితమే సినిమాల కోసమే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం.

మీకు మూవీస్ లోకి రావాలని ఎప్పుడు అనిపించింది ?
నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు మా మాస్టర్ గారు అనేవారు, బాగున్నావ్ సినిమాల్లో ట్రై చెయ్యొచ్చు కదా అని, ఫస్ట్ ఆయన వల్ల నాకు సినిమాల ఆ పై ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి కాస్త ఫ్యాషన్ అయింది. సినిమాలో యాక్ట్ చెయ్యాలని, మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యాలని ఉంది.

సంబంధిత సమాచారం :

X
More