‘రామాయణ’ ఇంటర్నేషనల్ స్క్రీనింగ్.. వారి వేట కోసం కూడా

Ramayana

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర నుంచి రానున్న పాన్ వరల్డ్ రేంజ్ సినిమాల్లో ఒకటే రామాయణ. దర్శకుడు నితీష్ తివారి రణబీర్ కపూర్, సాయి పల్లవి లాంటి స్టార్ నటుల కలయికలో చేస్తున్న ఈ భారీ విజువల్ ట్రీట్ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత సినిమా కాన్ ఈవెంట్ లో ప్రత్యేక ప్రదర్శనకి సిద్ధం అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ ఎక్స్ క్లూజివ్ గా రామాయణ కంటెంట్ నిర్మాత నమిత్ మల్హోత్రా చూపించనున్నారని టాక్.

అయితే ఇది కేవలం సినిమా రీచ్ కోసమే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ రిలీజ్ లో భాగంగా సరైన డిస్ట్రిబ్యూటర్ సంస్థ కోసం కూడా వేట ఇక్కడే అని తెలుస్తోంది. పలు పాపులర్ సంస్థలుతో టై అప్ అయ్యే అవకాశం కోసం చూస్తున్నారట. మరి వీరి ప్లానింగ్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. నిర్మాత ఈ సినిమాని అనేక దేశాల్లో విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే ఒక నోటెడ్ సంస్థ సహకారం కోసం చూస్తున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version