ఆసక్తికర వీడియోతో వచ్చిన హాట్ బ్యూటీ..!

Published on May 29, 2020 12:53 am IST

తెలుగులో సన్ ఆఫ్ సత్యమూరి, క్షణం వంటి హిట్ చిత్రాలలో నటించిన ఆదా శర్మ ప్రస్తుతం హిందీలో అడపాదడపా చిత్రాలలో నటిస్తుంది. అవకాశాల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. కాగా ఈ అమ్మడు తాజాగా ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు.

పల్లెటూరి ఆడపడుచులా చీర కట్టులో బట్టలు ఉతికి ఆరేసింది. అది కూడా కొత్తగా ఎలా బట్టలు ఆరబెట్టాలో చూపిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ బట్టలు అలా ఉతికి ఆరేయాలట.బట్టల ఉతకడం సంగతి ఎలా ఉన్న ఆదా అందాలు మాత్రం కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆదా మాన్ టూ మాన్ అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. ఇటీవల కమాండో 3, బేపాస్ రోడ్ సినిమలలో కనిపించింది. తెలుగులో కల్కి మూవీలో హీరోయిన్ గా చేసింది.

సంబంధిత సమాచారం :

More