ధనుష్ సరసన ఆద శర్మ

ధనుష్ సరసన ఆద శర్మ

Published on Aug 6, 2014 8:04 PM IST

Dhanush_Adad-sharma
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమై అందరినీ ఆకట్టుకున్న భామ ఆద శర్మ. తెలుగులోనే కాకుండా హిన్దీఎలొ కూడా సినిమాలు చేస్తున్న ఈ భామ సినిమాల్లోనే కాకుండా పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా పనిచేస్తుంది. ఇప్పటికే గోద్రెజ్ బ్యూటీ సోప్స్, ఓ సెల్ పాయింట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటోంది. తాజాగా వెజిటేరియన్ ని సపోర్ట్ చేస్తూ పెట ప్రకటనకి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది.

కొలవెరి డీ పాటతో బాషతో సంబందం లేకుండా అందరినీ ఆకట్టుకున్న హీరో ధనుష్. తాజాగా ఆద శర్మ ధనుష్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. కానీ అది సినిమా కాకపోవడం కాస్త వెళితి అనిపించే విషయమైనా, తను ధనుష్ తో కలిసి నటిస్తున్న యాడ్ నేషనల్ లెవల్లో బాగా ఫేమస్ అయిన సెంటర్ ఫ్రెష్ కోసం కావడం విశేషం. ఇన్ని రోజులు ధనుష్ ఒంటరిగా కనిపించిన సెంటర్ ఫ్రెష్ యాడ్స్ కి ఇకపై గ్లామర్ ని కూడా జత చేయనున్నారు.

తాజా వార్తలు