యువ హీరో అరవింద్ కృష్ణ నటించిన ‘అడవి కాచిన వెన్నెల’ ఆడియో ఈరోజు విడుదల అయింది. ఈ సినిమాలో అరవింద్ సరసన మీనాక్షి దీక్షిత్ హీరొయిన్ గా నటిస్తుంది. ఒక థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకి విశ్వనాధ్ రెడ్డి దర్శకత్వం వహించగా, కార్తీక్ రోడ్రిగేజ్ సంగీతం సమకూర్చారు.
ఈ సందర్బంగా హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, “మొదటిసారి ఒక పూర్తి హీరోగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సినిమా రెగ్యులర్ గా కాకుండా కొత్తగా ఉండే కథలు చేయాలనీ ఉంది” అని అన్నాడు. హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ మాట్లాడుతూ, “ఇది ఒక భిన్నమైన సినిమా, అద్భుతమైన సంగీతంతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది” అని అన్నారు. అలాగే దర్శకుడు విశ్వనాధ్ రెడ్డి, ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినోద్ కుమార్ సురేష్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా జూన్ నెలలో విడుదల కానుంది.


