డబ్బింగ్ లో పాల్గొంటున్న యంగ్ హీరో

Published on Jun 27, 2019 9:35 am IST

హీరో అడవి శేషు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం “ఎవరు”. నూతన దర్శకుడు వెంకట్ రామ్జీ ఈ మూవీని సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఎటువంటి సమాచారం లేకుండా తెరకెక్కుతున్న ‘ఎవరు’ మూవీ టైటిల్ పోస్టర్ ని కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. ఐతే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ పూర్తి కావడంతో నేటి నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారట.

శేషు సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రా నటిస్తుండగా పీవీపీ సినిమాస్ పతాకంపై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఆగస్టులో ఈ మూవీ విడుదల చేయనున్నారు. అడవి శేషు నటించిన గత రెండు చిత్రాలు “క్షణం”,”గూఢచారి” విజయం సాధించడంతో ఈ మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More