అందవిహీనంగా తయారైన అందాల హీరోయిన్

Published on Jul 16, 2019 10:18 am IST

బ్యూటీ ఆదా శర్మ 2008 లో వచ్చిన హిందీ హర్రర్ చిత్రం “1920” తో హీరోయిన్ గా పరిచయంగా కాగా దర్శకుడు పూరి నితిన్ హీరోగా తెరకెక్కించిన “హార్ట్ ఎటాక్” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు.తర్వాత “సన్ ఆఫ్ సత్యమూర్తి”,”క్షణం” వంటి హిట్ చిత్రాలలో నటించిన ఆదా శర్మ ఇటీవల రాజశేఖర్ హీరోగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ “కల్కి” చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా కనిపించారు.

సినిమాల సంగతి ఎలా ఉన్న ఆదాశర్మ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పుడూ అభిమానుల మనస్సుల్లో ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. ఐతే తాజాగా ఆదా పోస్ట్ చేసిన ఓ ఫోటో కి నెటిజెన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందింది. ఎప్పుడూ సెక్సీ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసే ఈమె ఇందుకు భిన్నంగా గుర్తు పట్టలేనంత అందవికారంగా తయారైన ఫోటో పోస్ట్ చేసి, ఎవరో గుర్తుపట్టండి అంటూ ఫ్యాన్స్ కి ఓ ఫజిల్ విసిరింది. ఈపోస్ట్ ని కొందరు ఫన్నీ గా తీసుకొని ఎంజాయ్ చేస్తుంటే, కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఆదా శర్మ “మాన్ టు మాన్” అనే హిందీ చిత్రంలో ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More