‘శశి’ కోసం ఆది స్టార్ట్ చేశాడు !

‘శశి’ కోసం ఆది స్టార్ట్ చేశాడు !

Published on Jun 29, 2020 3:09 PM IST

హీరో ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ‘శశి’ సస్పెన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఆది తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని.. ఆది ‘శశి’ అనే ఓ మాస్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన విడుదల చేసిన ఆది ఫస్ట్‌ లుక్‌ ను బాగా ఆకట్టుకుంది. ఫస్ట్‌లుక్‌లో రెండు వేరియేషన్స్‌ చూపించారు. చేతిలో మైకు పట్టుకుని కూల్‌గా ఒకటి, బ్యాక్‌ గ్రౌండ్‌లో గుబురు గడ్డం, జుట్టుతో కనిపిస్తోన్న ఆది లుక్‌ మరొకటి మొత్తానికి ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆర్‌. పి.వర్మ, రామాంజనేయులు, శ్రీనివాస్‌ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా అనంతరం రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లవ్‌ అండ్‌ డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

https://www.instagram.com/p/CCAfGtYFZS3/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు