ఇంప్రెసివ్ ఫస్ట్ లుక్ తో ఆది “అతిథి దేవోభవ”

Published on Sep 1, 2021 10:53 am IST


తన కెరీర్ ఆరంభంలోనే మంచి విజయాలను అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్. అయితే తర్వాత గ్రాఫ్ తగ్గినా ఇటీవల “శశి” చిత్రంతో కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు. అయినా కూడా తన నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చెయ్యడం మాత్రం కొనసాగిస్తూ వస్తున్నాడు. అలా ఇప్పుడు తన లైనప్ లో ఉన్న చిత్రాల్లో “అతిథి దేవోభవ” కూడా ఒకటి. దీని నుంచి ఇపుడు మేకర్స్ ఇంప్రెసివ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

ఒక అద్దంలో హీరో హీరోయిన్ మరి దాని బయట నుంచి దానిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా ఆది కనిపిస్తున్నాడు. మరి దీని వెనక ఇంకా ఎలాంటి ఆంతర్యం ఉందో కానీ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తుండగా ఆది సరసన నువేక్ష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :