బాలీవుడ్ నటి కృతి సనన్ చివరిగా ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ పౌరాణిక సినిమా ఆదిపురుష్‌లో హీరోయిన్ గా కనిపించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైనప్పటికీ, కృతి సనన్ సీతమ్మవారి పాత్రలో తన ఆకట్టుకునే అభినయంతో అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ బ్యూటీ తన స్వంత చర్మ సంరక్షణ బ్రాండ్, హైఫెన్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు.
కంపెనీ ప్రకారం వారి ఉత్పత్తులు శుభ్రమైనవి, 100% శాకాహారి, పెటా సర్టిఫికేట్ మరియు ప్లాస్టిక్ రహితమైనవని తెలిపారు. ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో కృతి ఫ్యాన్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు ఆమె బ్రాండ్ రాబోయే రోజుల్లో చక్కగా వృద్ధి చెందాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ కెరీర్ పరంగా కృతి సనన్ తదుపరి గణపత్ పార్ట్ 1లో టైగర్ ష్రాఫ్‌తో పాటు ప్రధాన పాత్రలో కనిపించనుంది. అలానే ప్రీప్రొడక్షన్ దశలో ఆమె నటిస్తున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి. కాగా వాటికి సంబందించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా త్వరలో రానున్నాయి.


