ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో రెడీ అవుతున్న “ఆదిపురుష్”

Published on Jun 16, 2021 1:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికి కొంత మేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తిరిగి మళ్ళీ షూట్ రీస్టార్ట్ కి రెడీగా ఉంది.

అయితే ఈ సినిమా కు గాను మేకర్స్ ఇది వరకు ఇండియన్ సినిమా దగ్గర వినియోగించని మోషన్ పిక్చర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారని విన్నాము.. ఇపుడు దానిపై మరోసారి బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి గాను మన దేశం భారీ విజువల్ ట్రీట్ అయిన 2.0 కన్నా అత్యధిక వి ఎఫ్ ఎక్స్ షాట్స్ ను పెడుతున్నారట.

బాహుబలి 2 కి 2500, 2.0 కి 3000 కి పైగా వి ఎఫ్ ఎక్స్ షాట్స్ వినియోగించగా ఆదిపురుష్ కి ఏకంగా 8000 వి ఎక్స్ షాట్స్ వినియోగిస్తున్నారట దీనితో ఆదిపురుష్ ఇండియన్ సినిమా దగ్గర ఏ రేంజ్ విజువల్ ట్రీట్ ను ఇవ్వనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ టాక్ సినీ వర్గాల్లో విస్తృతంగా నడుస్తుంది. మరి ఈ భారీ ట్రీట్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :