“ఆదిపురుష్” ఇంపాక్ట్ ఇండియాలోనే మరో లెవెల్లో ఉంటుందట.!

Published on Mar 24, 2021 3:59 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో కూడా తెలిసిందే.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో లక్ష్మణ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు సన్నీ సింగ్ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. రామాయణం పై తెరకెక్కుతున్న ఈ చిత్రాల్లో కనిపించే సెట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఈ దేశంలో ప్రతీ ఒక్కరికీ అద్భుతంగా అనిపిస్తాయి అని అలాగే విడుదల అయ్యాక ఆదిపురుష్ ఇంపాక్ట్ ఖచ్చితంగా మరో లెవెల్లో భారీ ఎత్తున ఉంటుంది అని స్ట్రాంగ్ గా తెలిపాడు.

అంతే కాకుండా తెలుగులో నటించడం కూడా కాస్త కొత్త అనుభూతిని కలిగిస్తుంది అని సన్నీ సింగ్ తెలిపాడు. ఇక ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కిషన్ కుమార్ లు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఆగష్టు 11న 3డి లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :