ఇంటర్వ్యూ : ఆదిత్ అరుణ్ – చీకటి గదిలో చితక్కొట్టుడు బాగా నవ్విస్తుంది !

Published on Mar 19, 2019 2:39 pm IST

ఇటీవల ట్రైలర్ తో సెన్సేషన్ సృష్టించిన చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో ఆదిత్ అరుణ్ మీడియా తో మాట్లాడారు. ఆయన ఏమ్మన్నారో ఇప్పుడు చూద్దాం..

ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ?

చీకటి గదిలో అనే టైటిల్ ఈచిత్రానికి కరెక్ట్ గా సరిపోద్ది. హారర్ కామెడీ స్టోరీ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. కానీ సినిమాలో డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ , వోకల్ కామెడీ తప్ప ఫీజికల్ గా అసభ్యకరంగా అయితే ఉండదు.

ఈ సినిమా స్టోరీ గురించి ?

ఒక అబ్బాయి పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు ఆ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురుకున్నారు అనే నేపథ్యంలో ఉంటుంది. సినిమా చూసి చాలా నవ్వుకుంటారు.

ఎన్ని రోజులు షూట్ చేశారు ?

నా కెరీర్ లో అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేసిన సినిమా ఇదే. ఈ చిత్రానికి కేవలం 19 రోజులు మాత్రమే తీసుకున్నాను.

ఈసినిమా చేయడానికి గల కారణం ?

చాలా మంది ఈ సినిమా డబ్బులు కోసం చేసావా అని అడుగుతున్నారు. మనీ కోసం కాదు సినిమా స్టోరీ బాగా నచ్చింది. ఈ చిత్రం చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా.

మీకు ఇప్పటికి సరైన బ్రేక్ రాకపోవడానికి గల కారణం ?

కొన్ని సినిమాలు ఆడుతాయి. కొన్ని అడవు. నేను సక్సెస్ ల గురించి ఆలోచించను. మంచి సినిమా చేశామా లేదా, చేస్తుంది కరెక్ట్ గా చేశామా అని మాత్రమే ఆలోచిస్తాను. ఇండస్ట్రీ లో నా ఏజ్ వున్నవారు కొందరు ఇప్పటికి సినిమాలు లేక ఖాళీగా వున్నారు. అలాగని సక్సెస్ అవసరం లేదని చెప్పను.

మీ తదుపరి చిత్రాలు గురించి ?

ప్రస్తుతం డ్యూడ్ అనే చిత్రాన్ని చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమా లో నాతో పాటు ప్రిన్స్ , ప్రియదర్శి కూడా నటిస్తున్నాను. ఇది గాక మరో రెండు చిత్రాలకు సైన్ చేశాను.

సంబంధిత సమాచారం :