మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన అదితి రావ్ హైదరి !

మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన అదితి రావ్ హైదరి !

Published on Jun 15, 2018 3:55 PM IST

చేసిన మొదటి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకోవడం చాలా కష్టం. ఇలాంటి ఫీట్ కొంతమంది నటీనటులకు మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటి వారిలో అదితి రావ్ హైదరి కూడ ఒకరు. హిందీ సినిమాల్లో బిజీగా ఉంటూనే మణిరత్నం ‘చెలియా’ సినిమాతో దక్షిణాదిన అడుగుపెట్టిన అదితి ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లకు పరిచయమైంది.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈరోజే విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండగా అదితి రావ్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అందంతో పాటు అభినయం కూడ కలిగిన అదితికి స్టార్ హీరోయిన్ అవ్వగల అన్ని అర్హతలు ఉన్నాయని ప్రేక్షకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ ను చూస్తుంటే అదితి త్వరలోనే తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు