రీసెంట్ గానే భోజ్ పూరీ సూపర్ స్టార్ రవికిషన్, తమిళ్ స్టార్ విశాల్ అన్ని సినీ పరిశ్రమల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టం చేశారు. సినీపరిశ్రమలో చాలామంది ఆడవాళ్లు వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారని ఆడవాళ్లే చెబుతున్నారు. కొన్ని నెలలు క్రితం తెలుగు ఇండస్ట్రీలోని మహిళా బాధితులంతా ఈ కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పి పోరాడారు. కొంతమంది సినీప్రముఖులు వారికి మద్దతు కూడా తేలిపారు.
ప్రస్తుతం ఈ కాస్టింగ్ కౌచ్ గురించి తాజాగా బాలీవుడ్ బ్యూటీ అదితీరావు హైదరీ స్పందించారు. ఆమె నటించిన తెలుగు సినిమా సమ్మోహనం రేపు విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గిన్న అదితీరావు భారతీయ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టం చేసింది. దీన్ని అరికట్టాలంటే మహిళలు దృఢంగా ఉండాలని చెప్పింది. టాలెంట్‌ను మాత్రమే నమ్ముకుని ముందుకెళ్లాలని సూచించింది. సినీ పరిశ్రమలో మహిళలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉండాలంటే మీడియా ముఖ్య భూమిక పోషించాలని చెప్పుకొచ్చింది.


