మహేష్ 25 వ చిత్రంలో నటించనున్న అదితి ?
Published on Jun 21, 2018 3:24 pm IST

సమ్మోహనం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన నటి అదితి రావ్ హైదరి . ప్రస్తుతం ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమెకి మరో గొప్ప అవకాశం లభించింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 25 వ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది . ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రదాన హీరోయిన్ గా నటిస్తుంటే మరో ముఖ్య పాత్ర కోసం అదితి ని తీసుకున్నారని సమాచారం ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ డెహ్రాడూన్ లో జరుగుతుంది .

ఇటీవల మహేష్ బాబు కూడా సమ్మోహనం సినిమాని చూసి అదితి నటనను మెచ్చుకున్న విషయం తెలిసిందే తాజాగా అదితి కి అయన తో నటించే అవకాశం రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు . మొత్తానికి తెలుగులో నటించిన మొదటి చిత్రంతోనే పెద్ద ఆఫర్ ను సాధించిన అదితి ముందుముందు ఇక్కడ వరుస చిత్రాలతో బిజీ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook