‘అంతరిక్షం’లో తన పాత్ర గురించి చెప్పిన అదితి !

‘అంతరిక్షం’లో తన పాత్ర గురించి చెప్పిన అదితి !

Published on Jun 13, 2018 4:30 PM IST

Aditi Rao

అదితి రావ్ హైదరి ప్రస్తుతం తెలుగులో ‘ఘాజీ’ చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న’అంతరిక్షం’ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆమె వివరించింది. ఈ సినిమాలో వ్యోమగామి పాత్రలో నటిస్తున్నాను సంకల్ప్ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు. అయన ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా థ్రిల్ గా ఫీలయ్యాను అని అన్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ , రాజీవ్ రెడ్డిలు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక అదితి నటించిన ‘సమ్మోహనం’ చిత్రం జూన్ 15న విడుదలకానుంది. ఈ చిత్రంలో ఆమె సుధీర్ బాబుకి జోడిగా నటించింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంఫై ఆమె చాలా ఆశలు పెట్ట్టుకుంది. ఈ సినిమానే అదితికి తెలుగులో మొదటి చిత్రం కావడం విశేషం .

తాజా వార్తలు