సౌత్ లో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో టాలెంటెడ్ నటుడు ఆదిత్య మీనన్.!

Published on Apr 6, 2021 1:02 pm IST

తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన స్టైలిష్ గ్యాంగ్ స్టర్ చిత్రం “బిల్లా”తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదిత్య మీనన్. అక్కడ నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాల్లో మొత్తం మన దక్షిణాదిలో నటించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ బర్త్ డే నేడు.. మొదటగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అయితే ఈ నటుడు ఇప్పుడు మన దక్షిణాదిలో ఆల్ మోస్ట్ మంచి ఫేమ్ ఉన్న స్టార్ హీరోల మోస్ట్ అవైటెడ్ సినిమాలతో బిజీగా ఉండడం గమనార్హం.

మొదటగా మన తెలుగు నుంచే వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ “హరిహర వీరమల్లు” చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అంతే కాకుండా అదే రోల్ పై ఇటీవలే యాక్షన్ లో గాయాల పాలు కూడా అయ్యారు. మరి దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “కార్తికేయ 2″లో కూడా ఆదిత్య కీలక పాత్ర చేస్తున్నాడట.

ఇక తమిళ్ లో విశాల్ తో ఓ సినిమా కన్నడలో అయితే అక్కడి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో “జేమ్స్” సినిమాలో ఓ ప్రధాన పాత్రనే చేస్తున్నాడట. ఇలా ఈ టాలెంటెడ్ నటుడు దక్షిణాదిలో దాదాపు సాలిడ్ ప్రాజెక్ట్స్ లో భాగం అయ్యారు. మరి ఇలాగే తాను మరిన్ని ఆసక్తికర సినిమాలు చెయ్యాలి భావిస్తూ మా 123 టీం మరోమారు ఆదిత్య మీనన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :