
‘కంచె’.. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించగా, దర్శకుడు క్రిష్ రూపొందించిన సినిమా. ఈ మధ్యకాలంలో ఒక్క టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసిన సినిమాల్లో ఒకటిగా ‘కంచె’ను చెప్పుకోవచ్చు. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ ఇలా తన ప్రతీ సినిమా ద్వారా ఏదైనా బలమైన అంశాన్ని డిఫరెంట్ కథాంశానికి ముడిపెట్టి తీసే దర్శకుడు క్రిష్, కంచె కోసం రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా విజువల్స్ ఏ స్థాయిలో ఉంటాయనేది స్పష్టంగా కనబడుతోంది.
ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్న టీమ్ సెప్టెంబర్ 1వ తేదీన ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. చిరందన్ భట్ అందించిన సంగీతం ఈ సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక సెప్టెంబర్ 2వ వారంలో ఈ సినిమా ఆడియోను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు.

