ముందుగా నమత్రగారే నాకు ఫోన్‌ చేశారు – అడివి శేష్

Published on Aug 12, 2018 11:51 am IST

నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన్న చిత్రం ‘గూఢచారి’ చిత్రం అద్భుతమైన టాక్ తో భారీ విజయం సాధించి.. ఇంకా విజయవంతంగా దూసుకెళ్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాంకేతిక విలువలతో సినిమాను అత్యుత్తమంగా రూపొందించారు.

దాంతో ఈ సినిమా చూసి సామాన్య ప్రేక్షకులతో పాటు సెలెబ్రేటిస్ కూడా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ చిత్ర హీరో అడివి శేష్ ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గూఢచారి’సినిమా చూశాక ముందుగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుగారి సతీమణి నమత్రగారు నాకు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు అని చెప్పారు. ఈ చిత్రం మహేష్ కి కూడా చాలా బాగా నచ్చిందట.

సంబంధిత సమాచారం :

X
More