పివిపి బ్యానర్ వారు వరుసగా సినిమాలు చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవలే సూపర్ హిట్ అయిన ‘బెంగుళూరు డేస్’ రీమక్ రైట్స్ కూడా తీసుకున్నారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం మరో చిన్న సినిమాకి పివిపి బ్యానర్ శ్రీకారం చుట్టబోతోంది. ‘కర్మ’, ‘కిస్’, ‘పంజా’, ‘బలుపు’ సినిమాల ద్వారా తెలుగు వారికి పరిచయం ఉన్న అడవి శేష్ హీరోగా పివిపి వారు ఓ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఈ సినిమా ద్వారా అడవి శేష్ దగ్గర పనిచేసిన రవికాంత్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. కాన్సెప్ట్ బేస్ కథతో తెరకెక్కే ఈ సినిమా అక్టోబర్ లో మొదల్ల్యే అవకాశం ఉందని సమాచారం. అడవి శేష్ ప్రస్తుతం ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’, ‘రన్ రాజా రన్’ మరియు ‘బాహుబలి’ సినిమాల్లో నటిస్తున్నాడు.


