వైవిధ్యమైన కథలతో వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ సీక్వెల్ ‘G2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి జూలై నెలలో ఒక భారీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ భారీ షెడ్యూల్ కోసం అడవి శేష్ తన సరికొత్త మేకోవర్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. క్లీన్ షేవ్ లుక్‌లో మరింత యంగ్‌గా, లీన్‌గా కనిపిస్తున్న శేష్.. పర్ఫెక్ట్ స్పై బాడీ లాంగ్వేజ్ కోసం జిమ్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. ‘తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం.. జూలైలో #G2 షూట్ ప్రారంభం కాబోతోంది’ అంటూ చిత్ర యూనిట్‌తో కలిసి ప్రిపరేషన్స్ అవుతున్న ఫోటోలను ఆయన షేర్ చేశాడు.
పాన్-ఇండియా లెవెల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.


