‘డెకాయిట్’ క్లైమాక్స్ షూటింగ్‌లో అడివి శేష్ బిజీ.. ఎక్కడో తెలుసా?

‘డెకాయిట్’ క్లైమాక్స్ షూటింగ్‌లో అడివి శేష్ బిజీ.. ఎక్కడో తెలుసా?

Published on Dec 31, 2025 11:00 PM IST

Dacoit

టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు షానీల్ డియో డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను పెంచేసింది.

కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందని.. ఇది ఓ కొండపైన షూట్ చేస్తున్నామని.. ఇలా న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర క్లైమాక్స్‌ను కొండపై చేయడం సంతోషంగా ఉందని అడివి శేష్ పేర్కొన్నాడు.

దీంతో ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఏ లెవెల్‌లో ఉండబోతుందా అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా అనురాగ్ కశ్యప్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు