శరవేగంగా “డెకాయిట్‌” షూటింగ్…సెట్స్ లో జాయిన్ అయిన శృతి హాసన్!

శరవేగంగా “డెకాయిట్‌” షూటింగ్…సెట్స్ లో జాయిన్ అయిన శృతి హాసన్!

Published on Jun 13, 2024 9:36 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం (గూఢచారి2) G2 మరియు డెకాయిట్‌ చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా డెకాయిట్ కి సంబందించిన షూటింగ్ పై ఒక క్లారిటీ వచ్చింది. హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో హీరోయిన్ శృతి హాసన్ పాల్గొనడం జరిగింది. షూటింగ్ గ్యాప్ లో అడివి శేష్ తో శృతి హాసన్ క్లిక్ కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం హైదారాబాద్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను సుప్రియ యార్లగడ్డ మరియు సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు