వచ్చే నెల నుంచి అడవి శేష్ కొత్త మూవీ

వచ్చే నెల నుంచి అడవి శేష్ కొత్త మూవీ

Published on Oct 17, 2014 6:20 PM IST

adivi-seshu
ఎన్నారై కుర్రాడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో అడవి శేష్. ‘పంజా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్ ఈ సంవత్సరం ‘రన్ రాజా రన్’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అడవి శేష్ రాజమౌళి పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇది కాకుండా అడవి శేష్ సోలో హీరోగా పివిపి బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడని ఇది వరకూ తెలియజేశాం. ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని అడవి శేష్ అంటున్నాడు. ‘వచ్చే నెలలో మొదలు కానున్న సినిమా కోసం రిహార్సల్స్ మొదలు పెట్టాను. నా సినిమాలో టాప్ గా
ఉండాలని’ అడవి శేష్ ట్వీట్ చేసాడు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

తాజా వార్తలు