
డా. మోహన్ బాబు నట వారసురాలిగా కెరీర్ ని ప్రారంభించినా అనతి కాలంలోనే తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మీ. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన సినిమా ‘దొంగాట’. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్ని రోజులుగా ఎలాంటి రిలీజ్ కోసం అయితే ఎదురు చూసారో అలాంటి అదృష్టమే ఇప్పుడు దొంగాట టీంని వరించింది.
గత కొద్ది రోజులుగా మే 8న నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతుండడంతో ఈ చిత్ర టీంకి మొదటి రోజున బాక్స్ ఆఫీసు వద్ద ఏమన్నా ఇబ్బంది రావచ్చు అని ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు లయన్ సినిమా మే 14కి వాయిదా పడడంతో దొంగాట సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది. అంతే కాకుండా ఈ వారం రిలీజ్ అవుతున్న సోలో సినిమా ఇదే కావడం వలన బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమాకి ఎక్కువగా కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ వారం రిలీజ్ అవ్వనున్న సోలో సినిమా కావడం వలన అనుకున్న దానికంటే డబుల్ గా థియేటర్స్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది.
అన్నీ అనుకూలించడంతో దొంగాట టీం చాలా హ్యాపీగా ఉండడమే, నేటి నుంచే ప్రమోషన్స్ ని హై రేంజ్ లో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ ఆన్ స్క్రీన్ ఒక స్టార్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర హైలైట్ కానుందని సమాచారం.

