అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!

అఖిల్ అయ్యాడు.. నెక్స్ట్ కంబ్యాక్ లిస్ట్ లో మెగా హీరో, రవితేజ!

Published on Aug 5, 2026 11:26 AM IST

ఈ ఏడాదిలో సాలిడ్ కంబ్యాక్ అందుకున్న హీరోస్ లో అఖిల్ అక్కినేని కూడా ఒకరు. తన లెనిన్ సినిమాతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ ని తాను అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక తన తర్వాత అదే రేంజ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు హీరోలు ఈ ఆగష్టు లోనే రాబోతున్నారు.

మొదటిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ తో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. గత సినిమాలు అన్నీ ఫెయిల్యూర్ గా నిలిచాయి. దీనితో మంచి కంబ్యాక్ కొట్టాలని కొరియన్ కనకరాజు తో వస్తున్నాడు. దీనిపై డీసెంట్ బజ్ కూడా ఉంది. సో ఇది తనకి కంబ్యాక్ అవుతుందో లేదో చూడాలి.

అలాగే తన తర్వాత ఇదే ఆగష్టు నెలలో సూపర్ పాజిటివ్ బజ్ తో ఉన్న మరో హీరోనే మాస్ మహారాజ రవితేజ. తాను నటించిన అవైటెడ్ సినిమానే ‘ఇరుముడి’. ఈ సినిమాతో కూడా రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సో అఖిల్ తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కంబ్యాక్ కొడతారా లేదా అనేది చూడాలి.

తాజా వార్తలు