‘భీమ్లా’ కే ఇలా ఉంటే మిగతా వాటికి ఎలా ఉంటుందో?

Published on Aug 31, 2021 2:20 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “భీమ్లా నాయక్”. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ శాలి మల్టీ స్టారర్ చిత్రం పై ఒక్కో అప్డేట్ తో మేకర్స్ అంచనాలు పెంచుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆడియో నుంచి ఫస్ట్ ట్రాక్ రిలీజ్ కి రెడీగా ఉండగా ఈ చిత్రం ఆడియో హక్కులు ఆల్ టైం రికార్డు ప్రైస్ కి అమ్ముడు పోయాయి. అయితే అసలు ఈ సినిమాలో మహా అయితే ఐదు పాటలకి కూడా మించవని తెలుస్తుంది.

అందులోని ఇది రీమేక్ సబ్జెక్ట్ కూడా అయినా కూడా ఆల్ టైం రికార్డు ధర ఈ చిత్రానికి దక్కింది దీనిని పవన్ సినిమాల ఇంపాక్ట్ థమన్ మ్యూజిక్ పై ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక మరి ఈ సినిమాకే ఇలా ఉంటే పవన్ నుంచి రాబోయే సెన్సేషనల్ ప్రాజెక్ట్ హరీష్, దేవిలా కాంబోకి ఎలా ఉంటుందో.. పైగా పాన్ ఇండియన్ ఫిల్మ్ “హరి హర వీరమల్లు” ఇంకా సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ కి ఎలాంటి ధరలు పలుకుతాయో ఊహించుకోవచ్చు..

సంబంధిత సమాచారం :