సీమలో పూర్తయింది నెక్స్ట్ కొరియాలో అంటున్న మెగా హీరో!

సీమలో పూర్తయింది నెక్స్ట్ కొరియాలో అంటున్న మెగా హీరో!

Published on May 24, 2025 9:29 PM IST

VT15

ప్రస్తుతం మెగా హీరోస్ లో చాలా మంది ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. అయితే వరుణ్ తేజ్ నుంచి మట్కా తర్వాత తన కెరీర్ 15వ సినిమాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుని తాను చేస్తున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీతో చేస్తున్న ఈ చిత్రం ఒక ఆసక్తికర హారర్ కామెడీగా తెరకెక్కిస్తుందో ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది.

మరి లేటెస్ట్ గా రాయలసీమ ప్రాంతం అనంతపూర్ లో ఓ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్ గా నేరుగా కొరియాలోనే దిగబోతున్నట్టుగా ఇపుడు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మరి ఇందులో వరుణ్ తేజ్ బ్యాక్ లుక్ కూడా చూడొచ్చు. మొత్తానికి ఈ సినిమా మాత్రం ఫుల్ స్వింగ్ లో ఎనర్జిటిక్ గా కంప్లీట్ అవుతుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు